ఈ జగమే మాయ .. ఆ మాయలో ప్రతిదీ పచ్చనోటే.. తారాసపడే తరుణంలో తల్లడింతలూ ఓ వైబోగవెటకారమై అలా అందకారంలో అందెగత్తెల్లా ఆకర్షిస్తుంటాయేమో.... తెగిపోయి ఉంటే గాలిపటం స్వేచ్చగా సంచరిస్తుందని దారాన్ని ఒదిలేసి దానికి ఆదారం లేకుండా చేసా . . భందాలతో పెనవేసుకున్న ఈ దేహానికి సంబందాలను తెంచేసి స్వేచ్చగా వదిలేసా.. కాని ఎంతసేపు ఎగరలేదు ఆ గాలిపటం.. గాలికూడా చొరబడని ఓ ముళ్ల కంపలో చిక్కుకుని తీయబోతే చిరిగిపోయింది.. నాకు తెలియలేదు అదే నా మనసుకి ప్రతిరూపమని.. తెగింది గాలిపటమే, చిరిగింది నా మనసుకూడ...సంపత్ నాయుడు
No comments:
Post a Comment