Wednesday, 29 April 2015

రూపానికో రూపాయికో సంబందించింది కాదు ప్రేమ రూపం లేని రెండు మనసుల కలయిక ప్రెమ అనుభవానికో ఆనందానికో సంబందించినది మాత్రమే కాదు ప్రేమ అనుభూతులకు అనురాగాలకు అద్దం లాంటిది ప్రేమ... రాగాల పల్లకిలొ అనురాగలను అందిస్తూ, ప్రేమానందాలను ప్రేమానుభూతులను పంచిస్తూ, జీవితపు పుటలో ఎక్కడుందో వెదుక్కునే పేజీ కాదు ప్రేమ జీవితము లోని ప్రతి పేజీ లొను ప్రేమకు ప్రతిగా, దాచుకునే నిజమైన నిఘంటువుకు నిదర్శనం ప్రేమ.. ఆశించకా ఆయువునే అందిస్తూ, అనురాగాన్ని పంచెస్తూ ఒకరిని ఒకరు ఆరాధిస్తూ ఆదరించుకునేదే ప్రేమ......కానీ ఇప్పుడేమో ధనానికో,కులానికో,కామానికో,మోహానికో లొంగిన ప్రేమ ప్రేమను ప్రేమగా కాకా ఒక నటనగా, ఒక అలవాటుగా చూస్తున్నా ఛరమనసులై, నిర్నయాలను మార్చుకుంటూ, ప్రియుడిని-ప్రియురాలిని మార్చుకుంటూ, మారు మనస్సులై ప్రేమ విలువలను మరుస్తూ-మారుస్తూ ప్రేమ శిలకున్నా గౌరవాన్నీ సైతం కరిగిస్తొన్నారు కొందరు ప్రేమికులు-కొందరి ప్రేమలు...కానీ మార్చుకునేది కాదు ప్రేమ అని గుర్తించి, ప్రేమానురాగాలను పంచుతు, ప్రేమానందాలను పెంచుతూ మంచి మనస్సులై, మంచి మనుషులై ప్రేమ వునికిని చాటుతున్నా నిజమైన ప్రేమికులకు.. ప్రేమికుల రొజు శుభాకాంక్షలు తెలుపుతు...........హృదయాలకు


No comments:

Post a Comment