Wednesday, 29 April 2015

ఎవరికెవరు ఏమీ కారు అవసరం ఉన్నంతవరకే పరిచయాలు, బంధాలు, అనుబంధాలు అన్న నిజం మనసుకు అర్ధమవుతుంటే తట్టుకోలేకుంది చిన్ని మనసు. జీవితం ఒక ప్రయాణమే కాదన్నది ఎవరు. ఒక్కొక్కరు పరిచయం అవుతారు. ఒకరొకరుగా వెళ్ళిపోతుంటారు. కొన్ని పరిచయాలు అలా మనసులో గుర్తుండిపోతాయి. ఎక్కువ దూరం కలసి ప్రయాణించినందుకో ఏమో మనకు మనమే ఎక్కువ బంధం పెంచేసుకుంటాం. ప్రేమంతా కుమ్మరిస్తాం. చివరికి గమ్యం చేరి వేరౌతుంటే బాధ తట్టుకోలేక కుంగిపోతాం. కాని మనతో ప్రయాణించిన వారికి ఆ బాధ ఉండదేమో. మనకై మనం పెంచుకున్న ఇష్టం మనది అందుకే మన మనసుకు అంత బాధ కలుగుతుందేమో. విడిపోయి వాళ్ళు దూరమైనా వారి గురించే అలోచిస్తుంటాం. దిగులుపడుతుంటాం. మనకు అన్ని నిజాలు తెలుసు కాని కొన్ని నిజాలు నమ్మలేం కాదు నమ్మడానికి ఇష్టపడము. భ్రాంతి ని వీడి నిజం తెలిసిన నాడు తామరాకు పై నీటిబొట్టు ఈ జీవితం అని తెలుస్తుంది......ప్రేమతో మీ ....... సంపత్ నాయుడు


No comments:

Post a Comment